మొహాలీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2026–27లో ఆంధ్ర క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. గురువారం మొహాలీలోని ఐఎస్ బింద్రా పీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్రపై 7 వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న మహారాష్ట్ర 20 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు చేసింది. అర్షిన్ కులకర్ణి (56), రంజీత్ నికమ్ (33 నాటౌట్) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో కేఎస్ నరసింహరాజు 3/39, సత్యనారాయణ రాజు 2/44 వికెట్లు పడగొట్టగా, బైలపూడి యశ్వంత్ 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
181 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర ఓపెనర్లు మారంరెడ్డి హేమంత్ రెడ్డి (35 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), షేక్ రషీద్ (43 బంతుల్లో 53; 6 ఫోర్లు) 11.4 ఓవర్లలో 110 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తర్వాత కెప్టెన్ రికీ భుయ్ (13) అవుటైనా, అశ్విన్ హెబ్బర్ (17 బంతుల్లో 34 నాటౌట్), ప్రసాద్ (12 నాటౌట్) కలిసి 19.2 ఓవర్లలో 181/3 స్కోరుతో మ్యాచ్‌ను ముగించారు. అశ్విన్ హెబ్బర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.




