వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయ కుటుంబాలకు ఊరటనిచ్చే తీర్పు వెలువడింది. అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం (బర్త్‌రైట్ సిటిజన్‌షిప్)పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టు 6న జారీ చేసిన కొత్త ఉత్తర్వులను వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు నిలిపివేసింది.
'నాథన్ వర్సెస్ ట్రంప్' కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం, అమెరికా భూభాగంలో జన్మించి అక్కడి చట్టాలకు లోబడి ఉండే పిల్లలకు రాజ్యాంగపరంగా లభించే పౌరసత్వంలో అధ్యక్షుడు కొత్త మినహాయింపులను సృష్టించలేరని స్పష్టం చేసింది. జూన్‌లో ట్రంప్ తొలి ఉత్తర్వును అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకున్న తర్వాత, ఆగస్టులో కొత్త కేటగిరీలతో మరో ఉత్తర్వు జారీ అయింది.
తల్లిదండ్రులిద్దరూ అమెరికా పౌరులు కాని పక్షంలో, నిర్దిష్ట విదేశీ ప్రభుత్వ ఉద్యోగులు, కమర్షియల్ సర్వీస్ లేదా సరోగసీ ద్వారా పౌరసత్వం పొందే ఏర్పాట్లకు సంబంధించిన పిల్లలకు పౌరసత్వాన్ని నిలిపివేయాలని ఆగస్టు ఉత్తర్వు ఆదేశించింది.
దీనిపై సెప్టెంబర్ 28న ACLU, ఏషియన్ లా కాకస్, NAACP లీగల్ డిఫెన్స్ ఫండ్ తదితర సంస్థలు దావా వేశాయి. H-1B, F-1 వీసాలపై అమెరికాలో ఉన్న వేలాది ప్రవాసాంధ్ర కుటుంబాలకు ఈ తీర్పు కీలక రక్షణగా నిలిచింది.




