బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన యువ నటుడు తేజ సజ్జా త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు.

తేజ సజ్జా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకోనున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

కుటుంబ సభ్యులు డిసెంబర్ నెలలో వివాహ ముహూర్తాన్ని పరిశీలిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తేజ సజ్జా వ్యక్తిగత విషయంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన అభిమానులు ఈ శుభవార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.