
నేడు హైదరాబాద్లో అమిత్ షా పాదయాత్ర: నిజాం కాలేజీ నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు; మధ్యాహ్నం 1 నుంచి 7 వరకు ట్రాఫిక్ మళ్లింపులు
ఓటర్ల జాబితా సవరణ (సర్)పై కాంగ్రెస్ ప్రచారానికి జవాబుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లో ‘లోక్తంత్ర బచావో, అరాజకత హటావో’ పాదయాత్ర చేసి, మొజంజాహీ మార్కెట్ వద్ద సభలో మాట్లాడతారు. దేశంలో 13.5 కోట్ల ఓట్లు తొలగించారని సీఎం రేవంత్ ఆదివారం దిల్లీలో ఆరోపించగా, ఆ పేర్లు చనిపోయినవారివి, వలస వెళ్లినవారివేనని బీజేపీ అంటోంది.