
మహాలక్ష్మి ఉచిత బస్సుతో హైదరాబాద్ మహిళల ఒక్కో ప్రయాణ ఖర్చు ₹30.4 నుంచి ₹9.7కు; 68% తగ్గుదల: ఎస్పీఏ అధ్యయనం
తెలంగాణ మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో మహిళల సగటు ప్రయాణ ఖర్చు ఒక్కో ట్రిప్‌కు ₹30.4 నుంచి ₹9.7కు, అంటే దాదాపు 68% తగ్గిందని విజయవాడ, దిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంయుక్త అధ్యయనం తేల్చింది. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు వాడే మహిళల వాటా 43.8% నుంచి 71.2%కు పెరిగింది.