
టెక్సాస్‌లో హెచ్-1బీ ఉద్యోగులున్న కంపెనీలకు వ్యవసాయ శాఖ గ్రాంట్లు బంద్; ఇతర శాఖలూ ఇదే దారి పట్టాలన్న కమిషనర్
హెచ్-1బీ వీసాదారులను ఉద్యోగంలో పెట్టుకున్న కంపెనీలకు తమ శాఖ నేరుగా ఇచ్చే గ్రాంట్లు ఇకపై ఇవ్వబోమని టెక్సాస్ వ్యవసాయ కమిషనర్ సిడ్ మిల్లర్ ప్రకటించారు. గవర్నర్ అబాట్, ఇతర శాఖలు కూడా ఇలాంటి నిబంధనలు తేవాలని ఆయన కోరారు; టెక్సాస్‌లో 7 లక్షలకు పైగా భారతీయ అమెరికన్లు ఉన్నారు.