తెలుగులో కొన్ని విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక మలయాళీ నటి కెరీర్‌లో ప్రస్తుతం అలజడి రేగింది. సోషల్ మీడియాలో ఆమెపై ఎడతెగని ప్రచారం జరుగుతోంది. ఒక రాజకీయ నాయకుడికి ఆమె దగ్గరైందని, ప్రస్తుతం ఆ నేతకు చెందిన ఫామ్‌హౌస్‌లోనే ఆమె ఉంటోందని పలువురు చెబుతున్నారు. ఈ ప్రచారం సినీ వర్గాల్లో, ఆమె అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎక్కడ షూటింగ్ జరిగినా, చీకటి పడే సమయానికి ఆ పొలిటీషియన్‌ ఫామ్‌హౌజ్‌లో సదరు హీరోయిన్ ప్రత్యక్షం కావాల్సిందేనని కూడా ప్రచారం ఉంది. ఈ వ్యవహారంపై నటి గానీ, సదరు రాజకీయ నాయకుడు గానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రచారంపై స్పష్టత రావాల్సి ఉంది.