తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సంబురాల్లో సాధారణ ప్రజలతో పాటు సినీ తారలు కూడా ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల సంప్రదాయ బద్ధంగా ముస్తాబై సందడి చేశారు. ఆమె ట్రెడిషినల్ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అనన్య నాగళ్ల తన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల బతుకమ్మ పండుగ వాతావరణంలో మమేకమై, తన సంప్రదాయ లుక్తో అందరినీ ఆకట్టుకున్నారు.



