కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన గత ఆగస్టు 20న తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో నక్కలగండి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలిపింది.

ఈ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని వెల్లడించారు. కేంద్రం ప్రతిపాదించిన గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చలో ఆయన ఏపీ తరఫున మాట్లాడారు.

అయితే, తాము చేపట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు తెలంగాణ అంగీకరించాలంటూ ఏపీ మెలిక పెట్టింది. పోలవరం-బనకచర్లలో పాలమూరు, నక్కలగండి భాగమేనని ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ వెల్లడించారు.

పాలమూరుపైనే కాకుండా ప్రాజెక్టులన్నింటిపై చర్చించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే విధంగా ఉండరాదని తెలంగాణ డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

గోదావరి-కావేరి అనుసంధానం పరిష్కారమైతే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అభిప్రాయపడింది.