ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెలవు ప్రకటించింది. ఈ నెల 28న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలకు సెలవు వర్తిస్తుంది.
ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కు అవసరమైన సిబ్బంది నియామకాలు, లాజిస్టిక్స్ ఏర్పాట్లు, ఇతర ఆదేశాలు జారీ చేసింది.
పోలింగ్ రోజున సెలవుతో పాటు, స్కూళ్లు, కాలేజీలకు అదనంగా మరో సెలవు కూడా ప్రకటించారు. దీంతో విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు లభించనుంది.
ఈ మేరకు జిల్లాల్లో సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు తదనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు.



