ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని ఐజీ రాజకుమారి తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాల ఎస్పీలకు అప్రమత్తత సందేశాలు పంపినట్లు ఆమె వెల్లడించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని ఐజీ పేర్కొన్నారు.

ముందస్తు భద్రతా ప్రణాళికలో భాగంగా, జిల్లాల వారీగా పోలింగ్‌ కేంద్రాల సున్నితత్వాన్ని అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా పోలింగ్ కేంద్రాలను అతి సున్నిత, సున్నిత, సాధారణ కేంద్రాలుగా వర్గీకరిస్తున్నారు.

గుర్తించిన సున్నిత, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాల వద్ద మొబైల్‌ బృందాలు, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఐజీ రాజకుమారి చెప్పారు.