తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, చిన్నారులు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ వేడుకల్లో మహిళలందరూ కలిసి బతుకమ్మ ఆడుతూ చిందులేశారు. మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గోని బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ ఉత్సాహభరితమైన వాతావరణంలో పండుగను ఘనంగా నిర్వహించారు.

ఈ సంబరాల్లో భాగంగా ఓ చిన్నారి బతుకు పాట పాడి అందరి మనసు గెలుచుకుంది. ఈ పాట పండుగ వాతావరణానికి మరింత శోభను తెచ్చింది. మహిళలు, చిన్నారులు కలిసి ఆడిన బతుకమ్మ ఆటలు, పాడిన పాటలు పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ ప్రజల ఐక్యత, సంస్కృతిని ఈ వేడుకలు మరోసారి చాటిచెప్పాయి.