ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమె జీవితం ఆధారంగా ఒక పీరియాడికల్ సినిమాను రూపొందిస్తున్నారు.
గరివిడి లక్ష్మీ తన బుర్రకథ ప్రదర్శనల ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించారు. ఆ కాలంలో సమాజంలో ఉన్న అనేక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
1990లలో పురుషులు ఆధిపత్యం వహించిన బుర్రకథ రంగంలోకి గరివిడి లక్ష్మీ ప్రవేశించారు. ఆమె పది వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి తనదైన గుర్తింపును పొందారు.
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు పక్క రాష్ట్రాల్లోనూ గరివిడి లక్ష్మీకి మంచి పేరు ఉంది. ఆమె కళా ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది.



