త్వరలో జరగనున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు భాజపా కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
గతంలో నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాల్లో భాజపా విజయం సాధించిందని రామచందర్‌రావు గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటింగ్ నమోదుపై చర్చించేందుకు శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భాజపా శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతో పాటు పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. రామచందర్‌రావు వారితో కలిసి పార్టీ వ్యూహాలపై చర్చించారు.



