రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానంతో యువనేత బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన తల్లి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, సతీమణి డాక్టర్ బొమ్మిరెడ్డి గీతికారెడ్డి కూడా పార్టీలో చేరారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామం ఆత్మకూరు రాజకీయాల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి తల్లి డాక్టర్ షకీలాను అధిష్టానం నిర్ణయంతో నామినేషన్ వేయించారు. ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
బొమ్మిరెడ్డి కుటుంబం అనాదిగా రాజకీయ కుటుంబంగా పేరుగాంచింది. డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి మూడు దఫాలు ఆత్మకూరు శాసనసభ్యులుగా పనిచేశారు.
ఆత్మకూరు పట్టణ ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నందున ప్రజాక్షేత్రంలో సేవలు అందించాలని తారక్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి ఆనం సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.



