తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రచురితమైన నిరాధార కథనాలను బీఆర్‌ఎస్ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తీవ్రంగా ఖండించారు. అక్టోబర్ 18న హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కొండపోచమ్మ ప్రాజెక్టు నీటిని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మళ్లించారనే ఆరోపణలతో వచ్చిన కథనాలను వివిధ దేశాలలోని బీఆర్‌ఎస్ ఎన్నారై సంఘాలు కూడా ఖండించాయి. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు సమాచారం ప్రచురించడం సరికాదని వారు పేర్కొన్నారు.
రైతుల సాగునీటి అవసరాలను కేసీఆర్ వ్యక్తిగత వ్యవసాయ క్షేత్రానికి ముడిపెట్టి నిరాధార కథనాలు రాయడంపై ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేసేవారు వాటికి సంబంధించిన ఆధారాలు చూపాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
సాగునీటి శాఖ అధికారిక రికార్డులు, కాలువల అసలు మార్గాలు, అధికారుల వివరణ వంటి ప్రాథమిక వివరాలను ప్రజల ముందుంచకుండా సంచలనం కోసం అపోహలు సృష్టించడం సమర్థనీయం కాదని వారు అభిప్రాయపడ్డారు.
ఆధారాల్లేని కథనాలతో కేసీఆర్‌పై బురదజల్లాలని చూడటం సహించబోమని మహేశ్ బిగాల అన్నారు. తప్పుడు కథనాలు ప్రచురించిన వారు కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.



