చంద్రహాస్ కోట్ల హీరోగా కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కె. రాఘవేంద్రరెడ్డి సమర్పిస్తున్నారు.

ఫిల్మ్ నగర్‌లోని సాయి బాబా గుడిలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. తెలంగాణ రెరా మాజీ ఛైర్మన్ డా. ఎన్. సాయి రెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.

కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఇది మూడవ సినిమా. దినేష్ కుర్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.