రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శనివారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై చర్చించారు.
పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సకాలంలో పూర్తి కావాలని ఆయన అధికారులకు సూచించారు.
కరీంనగర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ చిత్రామిశ్రా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో ఓటరు జాబితా సవరణ పురోగతిని ఆమె వివరించారు.



