మిజోరాం బ్యాటర్‌ చిన్మయ్‌ సుతార్‌ రంజీ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో రికార్డుల దుమ్ముదులిపాడు. నాగాలాండ్‌తో జరుగుతున్న ప్లేట్‌ గ్రూప్‌ మ్యాచ్‌లో సుతార్‌ 400 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లో సుతార్‌ 517 బంతులు ఎదుర్కొని 46 ఫోర్లు, 7 సిక్స్‌లు బాదాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో క్వాడ్రబుల్‌ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా సుతార్‌ రికార్డులకెక్కాడు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన పదో ఆటగాడిగా కూడా సుతార్‌ నిలిచాడు. ఈ మ్యాచ్ సోవిమాలో జరిగింది.

గతంలో రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు మహారాష్ట్ర బ్యాటర్‌ బాబాసాహెబ్‌ నింబాల్కర్‌ పేరిట ఉండేది. ఆయన 1948లో ఖతియావార్‌పై 443 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.