ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను తిరిగి పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వం విధ్వంసానికి, అరాచకానికి, అవినీతికి పాల్పడిందని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు.

2024 ఎన్నికల్లో కూటమికి 94 శాతం స్ట్రయిక్ రేట్ వచ్చిందని, 57 శాతం ఓట్ షేర్ లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది ప్రజల తీర్పుకు నిదర్శనమని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరూ అతీతులు కారని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును అందరూ గౌరవించాలని ఆయన సూచించారు.