తెలంగాణలో యాసంగి వరి సాగు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు సూచించారు. రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీటి వనరులు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయని ఆయన వివరించారు.

ఎల్‌ నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారవచ్చని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

రైతులకు నీటి పొదుపు గురించి చెబుతున్న ప్రభుత్వం, అందుబాటులోకి వచ్చిన నదీ జలాలను ఒడిసి పట్టడానికి ఏం చేసిందని పలు వర్గాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.