ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ శనివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశం రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడానికి దోహదపడింది.
ఈ భేటీకి ముందు, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, అమరావతి నిర్మాణంతో పాటు ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మోహన్ యాదవ్కు వివరించారు.
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తన విజన్, ప్రణాళికలను ముఖ్యమంత్రి నాయుడు ఈ సమావేశంలో పంచుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి పథకాలను ఎలా అమలు చేయాలనే తన ఆలోచనలను ఆయన వ్యక్తం చేశారు.



