ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ దేశ రాజధాని ప్రజలకు వినూత్న అభ్యర్థన చేశారు. పుట్టినరోజు వంటి ప్రత్యేకమైన వేడుకలను యమునా నది ఒడ్డున జరుపుకోవాలని ఆయన కోరారు.
నదిని శుభ్రంగా ఉంచే ప్రణాళికల్లో భాగంగా ఈ ఆలోచన చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు నది పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
వచ్చే నెల 7న తన పుట్టినరోజును కూడా యమునా నది ఒడ్డున చేసుకోబోతున్నట్లు పర్వేశ్ వర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు.
ఈ చర్య ద్వారా నది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల్లో అవగాహన పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.



