కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన 'రియాలిటీ' చిత్రం నుండి హీరోయిన్ దేవికా భట్ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ లుక్‌లో దేవికా భట్‌ను 'ఆలోచన' అనే పాత్రలో పరిచయం చేశారు.
కిరణ్ అబ్బవరం 'క', 'కె-రాంప్' చిత్రాల విజయాల తర్వాత 'రియాలిటీ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక ప్రత్యేక ప్రయత్నంగా నిలుస్తుంది.
జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన 'రియాలిటీ' టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. దేవికా భట్ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.



