మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ శక్తులతో చేతులు కలుపుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి తొలగించి దేశాన్ని శత్రువుల చేతుల్లో పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని ఆమె విమర్శించారు.
మహబూబ్నగర్ జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీకే అరుణ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులతో ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం కలవడం బాధాకరమని ఆమె అన్నారు.
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు ప్రజల్లో అనవసరమైన అపోహలు సృష్టిస్తున్నాయని డీకే అరుణ పేర్కొన్నారు.
దేశంలో ఓటరు జాబితాల సవరణ అనేది కొత్త ప్రక్రియ కాదని, గతంలోనూ ఇది చాలాసార్లు జరిగిందని ఆమె గుర్తుచేశారు.



