తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంపై, ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను వెంట‌నే పదవి నుంచి తొలగించాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.

ఈవీఎంల స్థానంలో తిరిగి బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డీఎంకే ఎంపీలు తీర్మానించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కూడా డీఎంకే పార్టీ తీర్మానించింది. ఈ కార్యక్రమంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది.

ఈరోజు ఉదయం 11 గంటలకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ సమావేశం జరిగింది. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం జరిగింది.