పెన్‌పహాడ్, అక్టోబర్ 14: పెన్‌పహాడ్ మండలంలోని మేగ్యతండాలో ఇటీవల నూతనంగా నిర్మించిన గ్రామీణ మహిళా శక్తి భవనాన్ని డీఆర్‌డీఓ పీడీ సన్యాసయ్య బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవన పనులను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా రాజు నాయక్ పీడీకి మొర పెట్టుకున్నారు. మహిళా శక్తి భవన నిర్మాణం కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా నేటికీ నయా పైస బిల్లులు రాలేదని ఆయన పీడీ దృష్టికి తీసుకువచ్చారు.
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన, బిల్లుల చెల్లింపుపై సర్పంచ్ వినతి
పెన్‌పహాడ్ మండలంలోని మేగ్యతండాలో నూతనంగా నిర్మించిన గ్రామీణ మహిళా శక్తి భవనాన్ని డీఆర్‌డీఓ పీడీ సన్యాసయ్య పరిశీలించారు. మహిళా శక్తి భవన నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఇంకా చెల్లించలేదని సర్పంచ్ భూక్యా రాజు నాయక్ పీడీకి విన్నవించారు.
రాజకీయాలుమూలం: Namasthe Telangana
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



