దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్ బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. పండుగకు ఇంకా కొన్ని రోజులే ఉండటంతో ప్రజలు తమ సొంతూళ్లకు బయలుదేరారు.

గత రెండు రోజులుగా నగరవాసులు పల్లెబాట పట్టడంతో బస్టాండ్లలో రద్దీ గణనీయంగా పెరిగింది. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తున్నారు.

టీజీఎస్‌ఆర్టీసీ దసరా పండుగ కోసం 7,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ బస్సులు ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఉద్దేశించినవి.

పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించారు. దీంతో చాలా మంది విద్యార్థులు ముందుగానే తమ ఇళ్లకు చేరుకున్నారు.