ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఫిలింనగర్ డివిజన్ పరిధిలోని బసవతారక నగర్లో నివాసం ఉంటున్న అమీర్ అలీకి ఎస్ఐఆర్ నోటీసు అందింది. 85 ఏళ్ల వయసులోనూ తాను బతికే ఉన్నానంటూ ఆయన ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
బసవతారక నగర్ ప్రాంతంలో మొత్తం 119 మంది నివాసితులకు ఎస్ఐఆర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులు అందుకున్న వారిలో అమీర్ అలీ కూడా ఉన్నారు.
తాను గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నానని, 11 ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నానని అమీర్ అలీ తెలిపారు. 2002 ఓటర్ల జాబితాలో తన పేరు ఉన్నప్పుడు నోటీసు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.
అమీర్ అలీ చెప్పిన వివరాల ప్రకారం, 1996కు ముందు ఆయన మక్తల్ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గంలో పలుమార్లు ఓటు వేశారు.



