రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద అనుబంధ గ్రామమైన మర్లకుంటతండాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐఏఎం) ప్రాజెక్టుకు సోమవారం శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టు ఫార్మాసిటీతో సంబంధం లేనిది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రేవంత్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాజెక్టులకు కేటాయించడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫార్మాసిటీ రద్దు చేసి భూములను తిరిగి రైతులకు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారని రైతులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన గోప్యంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే, ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఫ్యూచర్‌సిటీ కమిషనర్రేట్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.



