దసరా పండుగ సమయంలో తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. సంప్రదాయం పేరుతో పాలపిట్టలను బంధించి ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం, పాలపిట్టలను బంధించడం నేరం. ఈ చట్టం కింద కేసులు నమోదు చేయడమే కాకుండా, బహిరంగ ప్రదేశాల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
పండుగ ఆనందంలో మూగజీవాలను హింసించడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
అటవీ శాఖ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసింది. పండుగ సంబరాల్లో వన్యప్రాణులకు హాని కలిగించకుండా, నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరింది.



