బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో దవాఖానలో చేరారు. ఆయనకు ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

దవాఖాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక ప్రత్యేక వైద్యుల బృందం అద్వానీ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

98 సంవత్సరాల అద్వానీ వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఈ సంవత్సరం మే నెలలో కూడా ఇదే దవాఖానలో చికిత్స పొందారు. అప్పుడు కూడా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.