మాజీ మంత్రి రవీంద్ర నాయక్ కేసీఆర్ కుటుంబానికి చెందిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అక్రమ సంపాదన, భూదోపిడీకి సంబంధించిన ఆధారాలు లభిస్తే చట్ట ప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిందని రవీంద్ర నాయక్ ఆరోపించారు. స్వయం పాలన పేరుతో కుటుంబ పాలన జరిగిందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రజలు చేసిన త్యాగాలు, యువత పోరాటాలు, నిరుద్యోగుల ఆశలు, రైతుల ఆకాంక్షలకు న్యాయం జరగాలని ఆయన అన్నారు. ప్రజల వనరులు ప్రజలకే ఉపయోగపడాలని రవీంద్ర నాయక్ అభిప్రాయపడ్డారు.

నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాల్సి ఉందని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.