కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపురం, శింగవరం గ్రామాల్లోని పొలాలను సందర్శించారు. నీటి కొరతతో ఎండిపోతున్న పంటలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు.
జూరాల ప్రాజెక్టు చివరి ఆయకట్టు అయిన డీ-37 కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించాలని బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎండుతున్న పంటలను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు, నీటి లభ్యత లేకపోవడంతో పంటలు చివరి దశలో చేతికి అందకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాలను వివరిస్తూ వారు కన్నీళ్లు పెట్టుకున్నారు.
రైతుల గోడు విన్న మాజీ ఎమ్మెల్యే బీరం కూడా భావోద్వేగానికి లోనయ్యారు. పంటలు బాగా పెరిగి దిగుబడి వచ్చే సమయంలో నీరు అందకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు.



