కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నస్పూర్ లో డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
నస్పూర్ లోని కలెక్టరేట్ ఎదుట ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వారం రోజులుగా దీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు. శనివారం దివాకర్ రావు ఈ శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు మద్దతు తెలిపారు.
ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని దివాకర్ రావు గుర్తు చేశారు. గెలిచిన తర్వాత ఆ హామీలను గాలికొదిలేశారని ఆయన ఆరోపించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతుగా తాము ఎండగా ఉంటామని దివాకర్ రావు స్పష్టం చేశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన అన్నారు.



