ఈ నెల 14న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు నగరానికి చేరుకున్నారు. క్రికెట్ అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్ట్ వద్దకు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానుల ఉత్సాహం మధ్య ఆటగాళ్లు స్టేడియానికి చేరుకున్నారు.