ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. ఆనంది టైటిల్ రోల్‌ని పోషించారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. మంగళవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఇది మా సంస్థ నుంచి వస్తున్న కొత్త ప్రయత్నం. ఇప్పటివరకూ సినిమా చూసినవారంతా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు’ అని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ‘గరివిడి లక్ష్మి’ చిత్రం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘గరివిడి లక్ష్మి’ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
సినిమామూలం: Namasthe Telangana
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



