రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం తన ప్రచార వ్యూహాన్ని తీవ్రం చేసింది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే వ్యూహాన్ని అమలు చేస్తూ, ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయిన తరుణంలో ఈ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తే, అది మున్ముందు పార్టీ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉంటుందని సర్కార్ భావిస్తోంది. అందుకే, ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

ప్రధాన ప్రచార అస్త్రంగా ఒక కీలక వ్యక్తిని రంగంలోకి దించి, ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ రెండు స్థానాల్లో గెలుపు పార్టీకి నైతికంగా బలాన్ని ఇస్తుందని, రాబోయే ఎన్నికలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు ఒక సూచికగా నిలుస్తాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.