మహబూబ్నగర్, హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఓటు హక్కు నమోదు మందకొడిగా సాగుతోంది. జిల్లాలోని 15 మండలాలలో ఇప్పటి వరకు 31,594 మంది పట్టభద్రులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు నవంబర్ 6తో గడువు ముగుస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి మరో 19 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి 1,35,942 మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. ప్రస్తుత ఎన్నికకు జరుగుతున్న నమోదులో ఈ సంఖ్య తగ్గింది.
లక్ష మందికి పైగా పట్టభద్రులు ఇంకా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోలేదు. మిగిలిన 19 రోజులలో వీరంతా నమోదు చేసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
పట్టభద్రుల ఓట్లు పెరగాల్సింది పోయి తగ్గుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
నవంబర్ 6 తర్వాత దరఖాస్తుల స్వీకరణ ఉండదు కాబట్టి, అర్హులైన పట్టభద్రులు వెంటనే తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి.



