గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ శనివారం నగరంలోని ఏసీ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోపాలకు తావులేకుండా పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.

ఏసీ కాలేజీలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

మహిళా కళాశాలలో జరుగుతున్న శిక్షణా తరగతులను కూడా కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో స్వయంగా పర్యవేక్షించారు.