తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తీవ్రంగా ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 వేల పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అయితే ప్రభుత్వం కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేసిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ చర్య నిరుద్యోగుల ఆశలను వమ్ము చేయడమేనని ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగాల జాతర చూపిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ఆ హామీలతోనే ఓట్లు దండుకుందని ఆయన విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను ‘జాబ్‌లెస్ క్యాలెండర్’గా మార్చేసిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఇది నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపుతుందని ఆయన అన్నారు.



