తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ టికెట్ ధరలను పెంచడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పండుగ సంబురాలను లేకుండా చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

సాధారణ బస్సులను తగ్గించి, ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ చర్య దారుణమని ఆయన పేర్కొన్నారు.

ప్రయాణికులపై ఆర్థిక భారం మోపడం సరికాదని, పండుగ వేళ ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు హరీశ్‌రావు తన 'ఎక్స్' ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఆర్టీసీ టికెట్ ధరల పెంపుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.