డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కుంటిసాకులు చెప్తూ సంబంధం లేని కాగితాలు చూపించి డిప్యూటీ సీఎం భట్టి తప్పించుకున్నారని హరీశ్‌రావు ‘ఎక్స్’ వేదికగా బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారని నమస్తే తెలంగాణ నివేదించింది. విద్యుత్తు వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల పేరిట రూ. 5,420 కోట్ల అదనపు భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోపిందని హరీశ్‌రావు విమర్శించారు. విద్యుత్తు సరఫరా సక్కగుంటే సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలెందుకని ఆయన ప్రశ్నించారు.
విద్యుత్ చార్జీలపై భట్టి వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్
డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రాజకీయాలుమూలం: Namasthe Telangana
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



