తమ పంటలను కాపాడుకోవడం కోసం జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా మండిపడ్డారని నమస్తే తెలంగాణ నివేదించింది. ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని, అత్యంత హేయమైన చర్య అని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.