తెలంగాణ రాష్ట్రంలో పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ ఛార్జీలు రెట్టింపు చేసి, ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారని, పండుగ సంబురం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.
మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు గతంలో రూ.220 ఉండగా, ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. అలాగే, రూ.230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారని ఆయన ఆరోపించారు. సాధారణ బస్సులను తగ్గించి, ప్రత్యేక బస్సుల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.



