హైదరాబాద్ నగరం న్యూయార్క్, లండన్, టోక్యో వంటి ప్రపంచ రాజధానులతో పోటీ పడగలదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నగరాభివృద్ధికి బహుళ సంస్కృతులు బలం అని ఆయన పేర్కొన్నారు.

యువ పారిశ్రామికవేత్తలు, ఉన్నత వ్యక్తుల విజయాలను చూసి రాజకీయాలు చేద్దామని ఎన్నికలొచ్చినప్పుడు వారికి చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోని ఇతర నగరాలైన అమరావతి, బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలతో హైదరాబాద్ పోటీ పడదని ఆయన స్పష్టం చేశారు.

దేశంలోని ఇతర నగరాలు అభివృద్ధి చెందడం కూడా తనకు సంతోషమేనని ముఖ్యమంత్రి తెలిపారు. ఎక్కడ పెట్టుబడులు వచ్చినా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన వెల్లడించారు.

తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది.