హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 75 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లను (ఎస్‌ఐ) బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని పాలనాపరమైన మార్పులలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ విభాగాలతో పాటు కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న అధికారులకు కొత్త స్థానాలను కేటాయించారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐలను కూడా మార్పు చేశారు.
ఒకేచోట ఎక్కువకాలం పనిచేస్తున్న వారిని బదిలీ చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. బదిలీ అయిన వారు వెంటనే తమ కొత్త విధుల్లో చేరాలని ఆయన ఆదేశించారు.



