కరోనా మహమ్మారి సమయంలో పిల్లలు చదువుకు దూరమై, ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో చాలా మంది పిల్లలు ఫోన్‌లకు బానిసలయ్యారు. ఫోన్‌ పక్కన పెట్టలేక, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, శారీరక శ్రమకు దూరమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌ స్పోర్ట్స్‌ అకాడమీ పిల్లలను సరైన దారిలో పెట్టేందుకు ముందుకు వచ్చింది. బస్తీల్లో పిల్లలకు ఆటలు నేర్పడమే కాకుండా, వారిని సెల్‌ఫోన్‌ ఉచ్చు నుంచి బయటపడేసింది.

ఈ అకాడమీ ఐపీఎల్‌ తరహాలో ఏటా బస్తీల మధ్య ఆటల పోటీలు నిర్వహిస్తూ పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతోంది. కరోనా కాలంలో చదువు లేక, ఎవరింట్లో వాళ్లుండే రోజుల్లో ఫోన్‌తోనే కాలం వెళ్లదీసిన పిల్లలు, ఇప్పుడు ఆటలతో కొత్త జీవితాన్ని పొందుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతోంది.