సుగి విజయ్, జుప్సీ భద్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'ఐ హేట్ మ్యారేజ్' సినిమా టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఆర్య సినిమా బ్యానర్‌పై మాదం దయానంద్, కార్తిక్ వెంపటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో పరమేశ్ రేణుకుంట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన 'అప్పుడే పెళ్లా' అనే లిరికల్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది.

దర్శకుడు పరమేశ్ రేణుకుంట్ల మాట్లాడుతూ, నేటి తరం యువత ఆలోచనలను ఈ సినిమాలో వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశామని తెలిపారు. ప్రేమ, పెళ్లి, కెరీర్, స్వతంత్రంగా జీవించాలనే వారి భావజాలాన్ని ఇందులో ప్రస్తావించినట్లు చెప్పారు.

ఈ సినిమా Gen Z తరం ఆలోచనలు, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. టీజర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.