భారత్, వెస్టిండీస్ క్రికెటర్లు నాలుగో టీ20 మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు.
ఇండోర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన క్రికెటర్లు హైదరాబాద్ చేరుకున్నారు. అభిమానులు వారికి ఘనస్వాగతం పలికారు.
బుధవారం ఉప్పల్ వేదికగా ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మ్యాచ్ హైదరాబాద్‌లో జరగడం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది.



